25 రోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేశా: అనిల్ రావిపూడి

January 13, 2026


img

అనిల్ రావి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చెప్పినట్లే సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందే వచ్చేశారు. అందరినీ మెప్పించి తొలిరోజే రూ.84 కోట్లు కలెక్షన్స్ సాధించారు. ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుండటంతో హైదరాబాద్‌లో సక్సస్ మీట్ నిర్వహించారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “సాధారణంగా నేను ఓ సినిమాకి కధ వ్రాయాలంటే మూడు నెలలు పడుతుంది. డైలాగులతో సహా పూర్తి చేయాలంటే మరో 15 రోజులు పడుతుంది. కనీసం మూడున్నర నెలలు పడుతుంది.

ఈ విషయం నాతో ఉన్నవారందరికీ తెలుసు. కానీ నా కేరీర్‌లో తొలిసారిగా కేవలం 25 రోజుల్లోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ కధ రెడీ చేశాను. దీనికి స్పూర్తి ఎవరంటే బాస్ చిరంజీవిగారే. ఆయన సినిమా అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. చకచకా కధ సిద్ధమైంది. చకచకా షూటింగ్ జరిగిపోయింది. సినిమా మీ ముందుకు వచ్చేసింది. అందరికీ నచ్చేలా సినిమా తీయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది,” అని అనిల్ రావిపూడి అన్నారు. 

అనిల్ రావిపూడి ఇంతవేగంగా సినిమా తీసి హిట్ కొడుతుంటారు కనుకనే చిరంజీవి, వెంకటేష్ ఆయనతో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాతో వస్తారేమో? చూద్దాం.


Related Post

సినిమా స‌మీక్ష