కామెడీ నటుడుగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన వేణు ఎల్దండి ఒకే ఒక్క సినిమా ‘బలగం’తో దర్శకుడు తన సత్తా చాటి చెప్పాడు. ఈ మార్చి నెలకు బలగం విడుదలై మూడేళ్ళు పూర్తవుతుంది. కానీ గత ఏడాది వేణు ప్రకటించిన 'ఎల్లమ్మ' షూటింగ్ ఇంతవరకు మొదలుపెట్టనే లేదు.
ఈ సినిమాలో యువ హీరో నితిన్ ప్రధాన పాత్ర చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 15న సంక్రాంతి పండుగ రోజున ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేస్తానని వేణు ఎల్దండి చెప్పారు. కనుక ఎల్లమ్మలో హీరో ఎవరో ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైతే కానీ తెలీదు. ఫస్ట్ గ్లిమ్స్‌లో ఎల్లమ్మలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు.