అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోమవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అనిల్ రావిపూడి ముందే చెప్పేశారు.
చెప్పినట్లుగానే సినిమా చూపారు. ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కనుక మన శంకర వరప్రసాద్ గారిపై అభిమానాన్ని ప్రేక్షకులు కలెక్షన్స్ రూపంలో చూపారు.
ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ రూ.84 కోట్లు అని షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ చిరంజీవి తన ప్యాలస్ బయట కారు ముందు నిలబడి సిగరెట్ కాల్చుతూ న్యూస్ పేపర్ చదువుతున్నట్లు పెట్టిన పోస్టర్ అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది.
సంక్రాంతి పండుగ ఇంకా మొదలవక మునుపే తొలిరోజే రూ.84 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది కనుక పండగ పూర్తయ్యేసరికి రూ.500 కోట్లు రౌండ్ ఫిగర్ సాధించినా ఆశ్చర్యం లేదు.
ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి ఈ సినిమా నిర్మించారు.