మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో ‘రాజాసాబ్’ నుంచి నేడు క్రిస్మస్ బహుమతిగా రాజే యువరాజు సాంగ్ ప్రమో విడుదల చేశారు. ఓ చర్చిలో ‘నన్’గా చేస్తున్న హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడినట్లు పాటలో చూపారు. ఈ పాటని కూడా దర్శకుడు మారుతి వ్రాశారు. దీనిని తమన్ స్వరపరిచి సంగీతం అందించారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ, రిద్దీ కుమార్, జరీనా వాహేబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, స్టంట్స్: రామ్ లక్ష్మణ్, కింగ్ సోలోమన్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి పండుగ ముందు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.