నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా హిందువులు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాట్సప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఒక మతం వారు మరో మతాన్ని ఈవిధంగా గౌరవించడం చాలా అభినందనీయమే కదా? కానీ మాజీ ఐపీఎస్ అధికారి ఎమ్మెల్యేలు. నాగేశ్వర రావు దీనిపై సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్ట్ పెట్టారు. ఊళ్ళో పెళ్ళి జరుగుతుంటే కుక్కలు హడావుడి చేసినట్లు తమకు సంబంధం లేని క్రిస్మస్ పండగకు హిందువులు ఉత్సాహంగా జరుపుకుంటారు. శుభాకాంక్షలు తెలుపుకుంటారని ట్వీట్ చేశారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
చాలా మంది హిందువులు తమ మధ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెగ ఆనందిస్తారు.
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) December 25, 2025
ఇందుకు సరిగ్గా సరిపడే ఒక మంచి తెలుగు సామెత ఉంది. అదేంటంటే –
“ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావిడి.”
దీని అర్థం:
పెళ్ళి ఎవరిదైనా సరే, అందులో సంబంధం ఏమీ లేని వీధి కుక్కలు కూడా మొరుగుతూ, పరుగెత్తుతూ,…