మొన్న సిఎం రేవంత్ రెడ్డి కోస్గీ సభలో కేసీఆర్‌ని ఘాటు పదజాలంతో విమర్శించడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ, “ఒకవేళ కేసీఆర్ గనుక తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించకపోయుంటే రేవంత్ రెడ్డీ నువ్వు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవాడివా?
ఆయన తెలంగాణ సాధించబట్టే నువ్వు ముఖ్యమంత్రి కాగాలిగావనే విషయం మరిచిపోయి నీకంటే వయసు, అనుభవంలో చాలా పెద్దవారిన కేసీఆర్ గురించి ఆవిధంగా మాట్లాడవచ్చా?
అయినా కేసీఆర్ ఏమడిగారు? హైదరాబాద్, రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వాటికి సూటిగా సమాధానం చెప్పకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం చాలా తప్పు.
నాడు మేము హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తుంటే వద్దని చెప్పింది నువ్వే. నేను అధికారంలోకి రాగానే రైతులకు ఎవరి భూములు వారికిచ్చేస్తానని చెప్పావు కదా? కానీ ఎందుకివ్వలేదు? నేడు ఫార్మా సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవని కేసీఆర్ అన్న దాంట్లో తప్పేముంది? అయన జరుగుతున్నదే చెప్పారు కదా?” అంటూ హరీష్ రావు ఘాటుగా బదులిచ్చారు.