క్రిస్మస్‌ రోజున తీవ్ర విషాద ఘటన

December 25, 2025
img

నేడు క్రిస్మస్ పండుగనాడు కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కుని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నందున ఏం జరిగిందో తెలుసుకుని బస్సులో నుంచి బయటపడేలోగా మంటల్లో చిక్కుకొని బస్సు, డ్రైవర్, క్లీనర్‌తో సహా మొత్తం 13 మంది సజీవ దహనమైయ్యారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మిగిలినవారిలో 9 మంది బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి త్రుటిలో బయటపడ్డారు. వారి కళ్ళెదుటే క్షణాలలో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులలో చాలా మంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. 

పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. మంటల్లో చిక్కుకొని చనిపోయినవారి శవాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మరికొంత మంది చనిపోయి ఉండవచ్చని సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి బస్సులో నుంచి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. 

ఈ ఘటన ఈరోజు తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లా బెంగళూరు-హేబ్బులి జాతీయ రహదారిపై గోర్లతు గ్రామ సమీపంలో జరిగింది.

Related Post