పుట్టపర్తి సాయిబాబా బయోపిక్ అనంత టీజర్‌

November 12, 2025


img

పుట్టపర్తి సాయిబాబాని నమ్మేవారున్నారు. నమ్మనివారు కూడా ఉన్నారు. కానీ ఆయన జీవించి ఉన్నంత కాలం మానవసేవే మాధవసేవ అన్ని గట్టిగా నమ్మి ఆవిధంగానే ముందుకు సాగారు. తన భక్తులను ఆ దారిలోనే నడిపించారు. ఆయన శత జయంతి సందర్భంగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘అనంత’ అనే పేరుతో తీస్తున్న ఆయన బయోపిక్ టీజర్‌ సోమవారం చెన్నైలో విడుదల చేశారు. 

ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, వైజీ మహేంద్రన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సురేష్ కృష్ణ, మాటలు, పాటలు: పా.విజయ్; సంగీతం: తెనిసాయి తెండ్రల్‌ దేవా, కెమెరా: సంజయ్ బిఎల్, ఎడిటింగ్: ఎస్.రిచర్డ్, కోరియోగ్రఫీ: కళ చేశారు. ఇన్నర్ వ్యూ బ్యానర్‌పై గిరీష్ కృష్ణమూర్తి ఈ సినిమా నిర్మిస్తున్నారు.     


Related Post

సినిమా స‌మీక్ష