విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్‌

July 03, 2025


img

విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ సినిమా పూర్తి చేయడంతో ఈ నెల రెండో వారం నుంచి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో అనుకున్న సినిమా మొదలుపెట్టబోతున్నారు. రాయలసీమలో జరిగిన పీరియాడికల్ డ్రామాగా దీనిని తీయబోతున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజునాడు ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే...’ అంటూ ఈ సినిమా ప్రకటించారు.

ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ శివారులో ఓ భారీ సెట్స్‌ వేస్తున్నారు. అక్కడే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా ఆయన ప్రియురాలు రష్మిక మందన నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష