జూలై 3న రామాయణ ఫస్ట్ గ్లింమ్స్‌

July 01, 2025


img

బాలీవుడ్‌ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ‘రామాయణ’ పేరుతో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చింది. రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. కానీ మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కాబోతున్నాయి. 

షూటింగ్‌ పూర్తయినందున ఈ నెల 3న బెంగళూరులో అట్టహాసంగా ఓ కార్యక్రమ నిర్వహించి దానిలో రామాయణ ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణాసురుడిగా కన్నడ నటుడు యశ్, శూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారాదత్తా నటించారు.


Related Post

సినిమా స‌మీక్ష