థియేటర్లలో హరిహర వీరమల్లు ట్రైలర్‌ విడుదల

July 01, 2025


img

జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్ జంటగా చేసిన చారిత్రిక నేపధ్యంతో తీసిన సినిమా ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నెల 3 ఉదయం 11.10 గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు వీరమల్లు చిత్ర బృందం ప్రకటించింది. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేశారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష