తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌

July 01, 2025


img

దర్శకుడు శ్రీరామ్ వేణు-నితిన్‌ కాంబినేషన్‌లో ఈ నెల 4న ‘తమ్ముడు’ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా నేడు రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

సినిమా టైటిల్‌తోనే ఇది అక్కా-తమ్ముడు సెంటిమెంట్ సినిమా అని అర్దమవుతోంది. దీనిలో అక్క హత్యకు తమ్ముడు ప్రతీకారం తీర్చుకోవడం, అక్కకి ఇచ్చిన మాట కోసం విలువిద్యలో రాణించడం అనే రెండు వేర్వేరు అంశాలు ఈ సినిమాని కమర్షియల్ హంగులు జోడించేందుకు దర్శకుడు ఉపయోగించుకున్నారని భావించవచ్చు.

కనుక ‘రాబిన్‌హుడ్’తో నిరాశ చెందిన నితిన్‌ ఈ సినిమాతో హిట్ కొడతారా లేదా? అనేది జూలై 4న తెలుస్తుంది. 

ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేస్తున్నారు. వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సతీష్ కలిసి ఈ సినిమా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష