రాపో22 టైటిల్‌ గ్లింమ్స్‌ రేపే విడుదల

May 14, 2025


img

మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటిస్తున్న ‘రాపో22’ టైటిల్‌ ప్రకటించే సమయం వచ్చేసింది. గురువారం ఉదయం 10.08 గంటలకు రాపో22 టైటిల్‌ గ్లింమ్స్‌ విడుదల చేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వేశారు.

దానిలో ‘ఇది ఓ అభిమాని బయోపిక్’ అంటూ సినిమా కధ గురించి క్లూ కూడా ఇచ్చారు. ఓ సినీ హీరో కటవుట్‌ని చూస్తూ అడుగులు వేస్తున్న ఓ బాలుడిని ఆ పోస్టర్లో చూపారు.       

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా భాగ్యశ్రీ బోరే నటిస్తున్నారు. ఈ సినిమా మొదట హైదరాబాద్‌లో షూటింగ్‌ ముగించుకొని రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాలలో తర్వాత షెడ్యూల్‌ చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: మధు నీలకందన్‌ చేస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష