దాదా సాహెబ్ ఫాల్కేకి నామినేట్ అయిన ‘క’

April 25, 2025


img

కిరణ్ అబ్బవరంకు 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ప్రేమించిన అమ్మాయి ‘రహస్య’ ని పెళ్ళి చేసుకోగా వారు తల్లి తండ్రులు కాబోతున్నారు. సుజీత్, సందీప్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం చేసిన ‘క’ సినిమా 2024 అక్టోబర్ 31న విడుదలవగా అది సూపర్ హిట్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘క’ రూ.50 కోట్లుపైనే కలెక్షన్స్‌ రాబట్టింది. 

ఈ 2025లో కూడా కిరణ్ అబ్బవరం జీవితంలో ఎన్నడూ ఊహించని మరో అద్భుతం జరుగబోతోంది. ‘క’ సినిమా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే 2025 చిత్ర ప్రదర్శనకు నామినేట్ అయ్యింది. 

ఒక శక్తివంతమైన కధలో భావోద్వేగాలు అద్భుతంగా మేళవించి తీసిన ఈ సినిమా ఉత్తమ చిత్ర విభాగంలో నామినేట్ అయిన్నట్లు ‘క’ టీమ్‌ ప్రకటించింది. మే నెలాఖరున ఢిల్లీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. మరి ఈ సినిమాకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వస్తే అంత కంటే గొప్ప గుర్తింపు, గౌరవం ఏముంటుంది?


Related Post

సినిమా స‌మీక్ష