సింహా, లిజండ్, అఖండ సినిమాలతో వరుసగా మూడు హిట్స్ కొట్టిన నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కానీ ఈ సినిమా నుంచి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంతోషం కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. జూన్ 10వ తేదీన అఖండ-2 టీజర్ విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం.
అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
అఖండ-2ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినందున దీని హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్నారు.