కోలీవుడ్‌ హీరోతో అనుపమ డేటింగ్.. నిజమేనా?

April 13, 2025


img

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్‌ కోలీవుడ్‌ సీనియర్ నటుడు విక్రమ్ కుమారుడు, యువ హీరో ధృవ్ విక్రమ్‌తో డేటింగ్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి ‘లిప్ లాక్’ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం వారిద్దరూ ‘బైసన్’ అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఆ సినిమాలో ఓ ముద్దు సన్నివేశమే అదని మరికొందరు వాదిస్తున్నారు. ఇటీవల అనుపమ పరమేశ్వరన్‌ పలు సినిమాలలో ఇటువంటి లిప్ లాక్ సీన్లు, కాస్త ఓవర్ డోస్ అడల్ట్ కంటెంట్ సీన్స్‌లో నిరభ్యంతరంగా రెచ్చిపోయి నటిస్తోంది. కనుక ఇది కూడా అటువంటిదే అయ్యుండవచ్చని కొందరు భావిస్తున్నారు. 

అనుపమ పరమేశ్వరన్‌ మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా వచ్చిన అ.. ఆ.. సినిమాతో తెలుగులో ప్రవేశించి అనేక సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం పరదా, బైసన్‌తో సహా తెలుగు, తమిళ్, మలయాళంలో అనేక సినిమాలు చేస్తోంది. 

ఇక ధృవ్ విక్రమ్‌కి ఇది ఇంకా మూడో సినిమాయే. మొదట అర్జున్ రెడ్డికి తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’ చేశాడు. తండ్రి విక్రమ్‌తో కలసి ‘మహాన్‌’ చేశాడు. ఇప్పుడు మూడో సినిమా ‘బైసన్’ చేస్తున్నాడు.


Related Post

సినిమా స‌మీక్ష