మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న ‘విశ్వంభర’ నుంచి రేపు (శనివారం) ‘రామ రామ.. ' అంటూ సాగే తొలి పాటని విడుదల చేయబోతున్నందున ఈరోజు దాని ప్రమో విడుదల చేశారు. కాబోతోంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటని ఎంఎం కీరవాణి స్వరపరచగా శంకర్ మహదేవన్, లిపిసిక కలిసి ఆలపించారు.
సంక్రాంతి పండుగకి విడుదల కావలసిన విశ్వంభర జూలై 24న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.