కన్నప్ప టీజర్‌.. బాగానే ఉంది

March 01, 2025


img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్‌-2 శనివారం విడుదలయ్యింది. ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో తీశారనే విషయం టీజర్‌ చూస్తేనే అర్దమవుతోంది. యోధుడు, నాస్తికుడైన కన్నప్ప శివ భక్తుడుగా మారే ముందు ఏవిదంగా ఉండేవాడో టీజర్‌లో చూపారు. 

అచ్చమైన ఈ తెలుగు సినిమాలో కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్కి చెందిన హేమాహేమీలైన నటులు వివిద పాత్రలు చేస్తున్నారు. కనుక వారిలో కొందరి తెలుగు భాష ఉచ్ఛారణ లేదా డబ్బింగ్ తెలుగు భాషా ప్రియులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఖంగుమనే కంచు కంఠంతో మోహన్ బాబు అచ్చ తెలుగులో చెప్పిన డైలాగ్స్ సంతోషం కలిగిస్తాయి. 

కన్నప్ప లేదా మరేదైనా సినిమాని ఇతర భాషలలో డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా నటీనటుల భాష, ఉచ్ఛారణ విషయంలో బహుశః ఈవిదంగానే భావించవచ్చు. 

కనుక పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీయడం ఎంత గొప్పో, ప్రతీ భాషలో ఉచ్ఛారణ కూడా అంతే ముఖ్యం. హాలీవుడ్ సినిమాలు దేశీయ భాషల్లో డబ్ చేసినప్పుడు నటీనటుల భాష, ఉచ్ఛారణలో తేడా తెలుస్తున్నా భరించవచ్చు. కానీ ఓ భారతీయ సినిమా మరో భారతీయ భాషలో తీస్తున్నప్పుడు భాష, ఉచ్ఛారణ విషయంలో నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండేలా చేయలేరా? అనే సందేహం కలుగుతుంది. 

కన్నప్పకి జోడీగా నుపూర్ సనన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్‌ రుద్రుడుగా నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు దర్శకత్వం: ముఖేష్ కుమార్‌ సింగ్‌, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో కన్నప్ప నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/wKBP9dFxFBc?si=JuomVucRA0cojFgo" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష