రాజమౌళి సినిమాలో మరో బాలీవుడ్‌ నటుడు?

February 08, 2025


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో తీయబోతున్న సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుండటంతో ఈ సినిమాకి సంబందించి వార్తలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారు. రాజమౌళి టీమ్‌ తనని సినిమాలో నటించాలని కోరిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమార్‌ ఇటీవలే చెప్పారు. 

ఇదివరకు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు నానా పాటేకర్‌ని కూడా ఈ సినిమాలో తీసుకునేందుకు రాజమౌళి టీమ్‌ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఆయన తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తున్నారు. 

రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ళు దానికే అంకితమైపోవాలి. కనుక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం లభించడం ఎంత గొప్ప అవకాశం అయిన్నప్పటికీ, నటీనటులు అందరికీ ఇదే పెద్ద ఇబ్బందిగా కూడా ఉంటోంది. ఈ షరతుకి ప్రియాంక చోప్రా అంగీకరించి సినిమాలో నటించబోతున్నారు. కానీ పృధ్వీరాజ్ సుకుమార్‌, నానా పాటేకర్ ఇందుకు అంగీకరిస్తారో లేదో?


Related Post

సినిమా స‌మీక్ష