కిరణ్ తుమ్మలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న ‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి ‘నేలమీద నక్షత్రమా... ‘ అంటూ సాగే చక్కటి సాహిత్యంతో కూడిన పాట శనివారం మద్యాహ్నం విడుదలైంది. చంద్రబోస్ రచించిన ఈ పాటకి శ్రీ వసంత్ అద్భుతంగా స్వరపరచగా, అనుదీప్ దేవ్ చాలా మృధుమధురంగా పాడారు.
ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ ఓదెల అయ్యంగార్, సమీర్, బధ్రమ్, కిర్రాక్ సీత, ఎస్ఎస్ కాంచీ, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి, సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, ఆర్ట్: లావణ్య వేములపల్లి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, కొరియోగ్రఫీ: మొయిన్, భాను; యాక్షన్: కృష్ణంరాజు చేశారు.
ఈ సినిమాని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, బసవరాజు లాహిరిదర్, ఇస్మాయిల్ షేక్ కలిసి నిర్మించారు. డిసెంబర్ 27న డ్రింకర్ సాయి తన ప్రేయసితో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.