మనోడి దర్శకత్వంలో బాలీవుడ్‌ మూవీ జాట్

December 06, 2024


img

సందీప్ వంగా దర్శకత్వంలో రణదీర్ కపూర్ ‘డెవిల్’ సినిమా చేయగా, ఇప్పుడు గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ సీనియర్ నటుడు సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలలో ‘జాట్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా, వినీత్ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

మరో విశేషంఏమిటంటే, ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తుండగా దీనికి మన తెలుగు సంగీత దర్శకుడు తమన్ సంగీతం చేస్తున్నారు. మన స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌, కొరియోగ్రాఫర్ అనల్ ఆరాసు, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తదితరులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. 

సన్నీ డియోల్ సినిమా అంటే ఎక్కువగా యాక్షన్ సినిమాలే కనుక ఇది కూడా అటువంటిదే. ఈ సినిమా టీజర్‌ ఈరోజు మద్యాహ్నం 3.06 గంటలకు విడుదల కాబోతోంది. కానీ ఎవరో ముందే లీక్ చేసేశారు.

ఎలాగూ మరికొద్ది సేపటిలో అఫీషియల్ టీజర్‌ విడుదల కాబోతోంది కనుక లీకయిన ఆ టీజర్‌ చూడాల్సిన అవసరం లేదు. కనుక 3.06 గంటల తర్వాత జాట్ టీజర్‌ ఇదే వెబ్ సైట్‌లో ఇక్కడే చూడవచ్చు.

 


Related Post

సినిమా స‌మీక్ష