పుష్ప-2 పీలింగ్స్ అదిరిపోయిందిగా

December 01, 2024


img

చూస్తుండగానే పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది. దీనిలో ‘పీలింగ్స్..’ అంటూ సాగే పాటని ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. 

కేరళలో తన అభిమానుల కోసం పుష్ప-2 లో ఒక పాట మొదటి చరణం లిరిక్స్ మలయాళంలో తయారు చేయించానని అల్లు అర్జున్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అదే ఈ పీలింగ్స్ పాట! దీని మలయాళ వెర్షన్సిజు తురావూర్ వ్రాయగా తమన్ స్వరపరిచారు. ఈ పాటని మలయాళంలో అపర్ణా హరికుమార్, ఇందూ సంత్, గాయత్రి రాజీవ్ కలిసి పాడారు.

తెలుగు వెర్షన్ చంద్రబోస్ వ్రాయగా దానిని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాటని శంకర్ బాబు, కందుకూరి లక్ష్మి, లక్ష్మీ దాస హుషారుగా పాడారు. అ పాటకి అల్లు అర్జున్‌, రష్మిక మందన ఇద్దరూ చెలరేగిపోయి డాన్స్ చేశారు.  

పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు. 

పుష్ప-2కి దర్శకత్వం: సుకుమార్, కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. పుష్ప-2 డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష