ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తున్నట్లుంది. నాగ చైతన్య-శోభూ ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణా స్టూడియోలో పెళ్ళి చేసుకోబోతుండగా, అఖిల్ అక్కినేని, ఢిల్లీకి చెందిన జైనబ్ రవ్జీల వివాహ నిశ్చితార్ధం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
టాలీవుడ్ నటులు సిద్దార్థ్, అదితీరావులు రాజస్థాన్‌లో అలీలియా కోటలో మళ్ళీ డెస్టి నేషన్ వెడ్డింగ్ చేసుకొచ్చారు.
తాజాగా నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటి వాడయ్యాడు. ఎవరికీ తన పెళ్ళి విషయం చెప్పకుండా, ఎవరినీ పిలవకుండా అకస్మాత్తుగా పెళ్ళి చేసుకొని తమ పెళ్ళి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుబ్బరాజు వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. ఇంతవేయసు వచ్చే వరకు పెళ్ళి చేసుకోకపోవడంతో అతనికి పెళ్ళి ఆలోచన లేదనే అందరూ అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పెళ్ళి చేసుకొని ఫోటో పెట్టేశాడు.
ఇక మహానటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి సురేష్ కూడా తాను పెళ్ళి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో ప్రకటించింది. గత 15 ఏళ్ళుగా తమ బంధం ఉందని ఇకపై జీవితాంతం ఉంటుందని తెలియజేస్తూ, కాబోయే భర్త ఆంటోనీతో దీపావళినాడు తీసుకున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆంటోనీ దుబాయ్‌లో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కనుక పెళ్ళి తర్వాత కీర్తి సురేష్ భర్త వద్దకు వెళ్లిపోవాలనుకుంటే సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పదు. లేదా ఇంకా సినిమా అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి కనుక చెన్నైలోనే ఉంటూ దుబాయ్‌కి రాకపోకలు సాగిస్తూ సినిమాలు చేసుకోవచ్చు.