అమీర్‌పేట్ ఆంజనేయస్వామి గుడిలో జాన్వీ పూజలు

November 07, 2024


img

ప్రముఖ బాలీవుడ్‌ నటి, దేవర హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ గురువారం ఉదయం అమీర్‌పేట్ మధురానగర్‌లో గల ఆంజనేయస్వామి గుడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. 

జాన్వీ కపూర్‌ రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణా స్టూడియోలో ఆ సినిమా ఫోటో షూట్ కోసం వచ్చినప్పుడు మధురానగర్‌లో గల ఆంజనేయస్వామి వారి ఆలయం గురించి తెలుసుకొని, గుడికి వెళ్ళి పూజలు చేశారు. జాన్వీ కపూర్‌కి దైవభక్తి ఎక్కువే. కనుక ఏ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ జరిగితే అక్కడి దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తుంటారు. 

జాన్వీ కపూర్‌ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన్నట్లు తెలియగానే ఆమెను చూసేందుకు క్షణాలలో భారీగా జనం తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ జనాలను నియంత్రించలేక పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆమె వెళ్ళిపోగానే జనాలు కూడా వెళ్ళిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

    

 

(Video Courtcy: Telugu Scribe)

Related Post

సినిమా స‌మీక్ష