ఓం భీమ్ బుస్ అంటూ అందరినీ నవ్వించిన శ్రీవిష్ణు ఇప్పుడు స్వాగ్ సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమాలో రీతు వర్మ, మీరా జాస్మిన్, సునీల్, రవిబాబు, గోపరాజు రమణ, గెటప్ శ్రీను, దక్ష నాగార్కర్, శరణ్య ప్రదీప్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ప్రధాన పాత్రలలో స్వాగ్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా ట్రైలర్ చూస్తే చాలా వెరైటీగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హాసిత్ గోలి, సంగీతం: వివేక్ రామస్వామి సాగర్, కెమెరా: వేదరామన్ శంకరన్, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: నందు మాస్టర్, ఎడిటింగ్: విప్లవ్, కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.