దీపావళికి వస్తున్న మెకానిక్ రాఖీ

July 18, 2024


img

గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి రెండు విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్‌, తర్వాత మెకానిక్ రాఖీగా రాబోతున్నాడు. ముళ్ళపూడి రవితేజ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. త్వరలోనే మొదటి పాట విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది. విశ్వక్ సేన్‌ 10వ సినిమాగా వస్తున్న మెకానిక్ రాఖీకి కధ, దర్శకత్వం రవితేజ ముళ్ళపూడి, కెమెరా: మనోజ్ కాటసాని, యాక్షన్: సుప్రీం సుందర్. 

మెకానిక్ రాఖీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. 

దీని తర్వాత సినిమా లైలా 2025, ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున విడుదల కాబోతోంది. రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష