కన్నప్పలో శివపార్వతులు వీరే

April 17, 2024


img

మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప సినిమాలో శివపార్వతులుగా కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్‌ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ముందు ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడిగా నటించబోతున్నట్లు మంచు విష్ణు సూచించినప్పటికీ, ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కన్నప్ప టీం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

పార్వతి పాత్రకు ముందు నయనతార లేదా అనుష్కలను తీసుకుందామని అనుకొన్నప్పటికీ, కాజల్ అగర్వాల్ అయితే కాస్త కొత్తగా ఉంటుందని ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది.   

ప్రస్తుతం హైదరాబాద్‌, రామోజీ ఫిలిమ్ సిటీలో కన్నప్ప సినిమా షూటింగ్‌ జరుగుతోంది. మంగళవారం నుంచి అక్షయ్ కుమార్‌ దానిలో పాల్గొంటున్నారు కూడా. త్వరలో కాజల్ అగర్వాల్ కూడా వచ్చి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష