రేపు రామ్ చరణ్‌ పుట్టిన రోజు... జరగండి పక్కకి

March 26, 2024


img

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని రేపు (బుధవారం) ఉదయం 9 గంటలకు శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్‌ సినిమా నుంచి ‘జరగండి...’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో ప్రకటించింది. 

ఇది రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రమే అయినప్పటికీ, ఈ సినిమాకు సంబందించి ఇంతవరకు ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కనుక వారికి చాలా సంతోషం కలిగించే విషయమే. 

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా కియరా అద్వానీ నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాస్ర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కాబోతోంది.      



Related Post

సినిమా స‌మీక్ష