ఏప్రిల్‌ నుంచి రాజా సాహెబ్ షూటింగ్‌ మళ్ళీ షురూ

March 23, 2024


img

పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగిన ప్రభాస్‌ మారుతి వంటి చిన్న దర్శకుడుతో ‘రాజా సాబ్’ కామెడీ సినిమా ఒప్పుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులను అలరించేందుకు మద్యలో అటువంటి సినిమాలు చేయడం చాలా ఆహ్వానించదగ్గదే.

అయితే కల్కి ఎడి2898తో అంతర్జాతీయ స్థాయి సినిమాతో బిజీగా ఉండటం వలన ‘రాజా సాబ్’కి పూర్తి సమయం కేటాయించి పూర్తి చేయలేకపోయాడు. కానీ ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రాజా సాబ్ షూటింగ్‌ పూర్తయ్యే వరకు అంటే సుమారు నెలరోజులు పైగా ప్రభాస్‌ బల్క్ డేట్స్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

కనుక ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రాజా సాబ్ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మారుతికి ప్రభాస్‌ ఈ మాత్రం సమయం కేటాయిస్తే, ఆయన శరవేగంగా ప్రభాస్‌ పాత్రకు సంబందించి సన్నివేశాలన్నీ పూర్తిచేసేయగలరు. కనుక ఈసారి ‘రాజా సాబ్’ షూటింగ్‌ మొదలైతే సినిమా పూర్తయిపోయిన్నట్లే భావించవచ్చు. 

ఈ సినిమాకి సంగీత దర్శకుడు: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష