రవితేజ కుటుంబం నుంచి మరో హీరో... మాధవ్

March 24, 2023


img

మాస్ మహరాజ్ రవితేజ వరుసగా కాకపోయినా మాద్యమద్య హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో బాగానే నిలద్రొక్కుకొన్నారని చెప్పవచ్చు. కనుక వారసులను దించే సమయం ఆసన్నమైందనే భావించవచ్చు. రాజా ది గ్రేట్ సినిమాలో కొడుకు ‘మహాధన్’ని పరిచయం చేశారు. ఇప్పుడు రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ను హీరోగా పరిచయం అవుతున్నాడు. 

‘పెళ్ళిసందD’ సినిమాతో అందరి ప్రశంశలు అందుకొన్న గౌరి రోణంకి దర్శకత్వంలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జేజేఆర్ రవిచంద్, యలమంచిలి రాణి కలిసి నిర్మిస్తున్న సినిమాతో మాధవ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దీనికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నిర్మాతలు సురేష్ బాబు, బెక్కెం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. 

దర్శకురాలు గౌరి రోణంకి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నా మొదటి సినిమా ‘పెళ్ళిసందD’ని అందరూ ఆదరించి హిట్ చేశారు. అలాగే యూత్‌ఫుల్ అండ్ కలర్‌ఫుల్ మూవీగా తీయబోతున్న ఈ సినిమాని కూడా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. Related Post

సినిమా స‌మీక్ష