జూలై 29 నుంచి రామారావు ఆన్‌ డ్యూటీ

June 23, 2022


img

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో సిద్దమైన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రం జూలై 29న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టరులో రవితేజ తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నట్లున్న ఫోటో వేశారు. 

కొన్ని యధార్ధ ఘటనల ఆదారం రూపొందిన ఈ సినిమాలో రవితేజ డెప్యూటీ కలెక్టర్‌గా నటించారు. రవితేజకు జోడీగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ ఇద్దరు హీరోయిన్లు నటించారు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్, ఆర్‌టి టీం వర్క్స్ బ్యానర్‌లలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, నాజర్, నరేశ్, వేణు తొట్టెంపూడి, రాహుల్ రామకృష్ణ, ప్రవిత్ర లోకేష్, చైతన్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

సినిమా షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు చిత్ర బృందం తెలియజేసింది. త్వరలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారు.  

 రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రానికి కెమెరా సత్యన్ సూర్యన్, సంగీతం శామ్ సిఎస్ అందించారు. 


Related Post

సినిమా స‌మీక్ష