చివరికి మదర్స్ డే గ్రీటింగ్ కూడా తిన్నగా చెప్పడు కదా?

May 09, 2022


img

ఒకప్పుడు దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల కోసం జనాలు ఆత్రంగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆయన పెట్టే వివాదాస్పద ట్వీట్ల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు అందరూ చూడదగ్గ గొప్ప సినిమాలేమీ ఆయన తీయడం లేదు కనుక. 

నిజానికి అటువంటి గొప్ప సినిమాలు ఇక తీయలేనని వర్మ కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఈవిదంగా వ్యవహరిస్తూ జనాలు తనను మరిచిపోకుండా తన ఉనికిని కాపాడుకొంటున్నారని చెప్పవచ్చు. నిన్న మదర్స్ డే సందర్భంగా ఆయన తనదైన శైలిలో తన తల్లికి శుభాకాంక్షలు చెప్పారు. 

వర్మ తన తల్లి పక్కన జ్యూస్ గ్లాస్ పట్టుకొని కూర్చొని తీసుకొన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “హ్యాపీ మదర్స్ డే మామ్! నేను ఓ మంచి కొడుకును కాకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఓ గొప్ప తల్లివి,” అని మెసేజ్ పెట్టారు. ఆయన తన గురించి చెప్పుకొంది అక్షరాల నిజమని అందరికీ కూడా తెలుసు.


Related Post

సినిమా స‌మీక్ష