జూ.ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్?

January 17, 2022


img

అలనాటి సూపర్ డూపర్ హిట్ బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనుమరాలిగా వేసిన శ్రీదేవి, పెరిగి పెద్దదైన తరువాత ఆయనతోనే హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌ మనుమడు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా చేయబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ చేయబోతున్న చిత్రంలో మొదట కియరా అద్వానీని అనుకొన్నప్పటికీ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయాలని భావిస్తుండటంతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న జాన్వీ కపూర్ అయితే బాగుటుందనిని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో వందల కోట్లు పెట్టుబడితో పాన్ ఇండియా మూవీలు తీస్తూ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయస్థాయికి ఎదగడంతో జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లో మంచి ఆఫర్ వస్తే చేయడానికి సిద్దం అని ఇదివరకే చెప్పింది. కనుక శ్రీదేవి కూతురు జాన్వీని టాలీవుడ్‌లోకి తీసుకువస్తే ఆ ఘనత జూ.ఎన్టీఆర్‌, కొరటాలకే దక్కుతుంది. 


Related Post

సినిమా స‌మీక్ష