ఏకే రీమేక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రేటు అదిరింది..!

July 30, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ గా ప్లాన్ చేసిన ఈ షూటింగ్ లో సినిమాకు సంబందించిన ముఖ్య తారాగణం పాల్గొంటుందని తెలుస్తుంది. సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ తో రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ రైట్స్ 23 కోట్ల దాకా పలికినట్టు టాక్. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి మరో 44 కోట్ల దాకా రేటు చెబుతున్నట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ రైట్స్ లేకుండానే ఏకే రీమేక్ భారీ బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ ఎంట్రీతో ఈ సినిమా రేంజ్ మారిపోయిందని చెప్పొచ్చు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నా సరే సినిమా మొత్తం త్రివిక్రం శ్రీనివాస్ వెనక ఉండి నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష