సినీ నటి కవిత ఇంట్లో విషాదం..!

June 17, 2021


img

కరోనా మహమ్మారి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను బలి తీసుకుంది. సెకండ్ వేవ్ విజృంభన మరోసారి అందరిని ఇబ్బంది పెడుతుంది. సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీల ఇంట విషాధాన్ని మిగిల్చింది ఈ వైరస్. తాజాగా సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదాన్ని నింపింది. దక్షిణాది సినిమాల్లో సుపరిచితురాలైన నటి కవిత కుటుంబంలో కరోనా వైరస్ పెను విషాదాన్ని మిగిల్చింది. కరోనా వైరస్ తో కవిత తనయుడు సంజయ్ రూప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంజయ్ రూప్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కవిత భర్త దశరధ కూడా కరోనాతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కవిత కుమారుడు మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. 



Related Post

సినిమా స‌మీక్ష