ప్రభాస్ న్యూ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..!

February 22, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాల అప్డేట్ తో ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాడు. రాధే శ్యాం రిలీజ్ డేట్ తో పాటుగా ఈమధ్యనే ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. సినిమా కూడా అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇదిలాఉంటే కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్.. ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లాయి. సలార్ కోసం ఇల్లందు కోల్ మైన్ లో షూటింగ్ జరిపారు.

ఇక లేటెస్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ షూట్ కు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ చూస్తే రాముడి పాత్ర కోసం రెడీ అయినట్టుగా ఉన్నాడు. ఆదిపురుష్ షూటింగ్ కోసమే ప్రభాస్ అలా సిద్ధమయ్యాడని అంటున్నారు. ప్రభాస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ న్యూ లుక్ ఆదిపురుష్ కోసమేనా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష