ఈరోజు చాలా స్పెషల్..!

September 22, 2020


img

కొణిదెల శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి మెగాస్టార్ గా మారడానికి తొలి అడుగు పడ్డది ఈరోజే.. అవును ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు.. అది ఆయన మాటల్లోనే చెప్పుకుంటే. ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ రోజు.. నా తొలి చిత్రం ప్రాణం కరీదు రిలీజైన రోజు అన్నారు చిరంజీవి. నా జీవితంలో ఆగష్టు 22కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 22కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.. ఆగష్టు 22న మనిషిగా ప్రాణం పోసుకుంటే.. సెప్టెంబర్ 22న నటుడిగా ప్రాణం (ఖరీదు) పోసుకున్న రోజు. నా మొదటి సినిమా రిలీజైన రోజు అంటూ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ పెట్టారు. తనని ఈ స్థాయికి చేర్చిన ప్రేక్షకులందరికీ.. ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు అంటూ చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరుతో పాటుగ చరణ్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.             

 


Related Post

సినిమా స‌మీక్ష