మహేష్ కథతో రామ్ చరణ్ సినిమా..!

April 08, 2020


img

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. గ్యాంగ్ స్టర్ కథతో వంశీ పైడిపల్లి మహేష్ తో మూవీ ప్లాన్ చేశారు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. మహేష్ తో ఆల్రెడీ మహర్షి సినిమా తీసి హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి సడెన్ గా మహేష్ హ్యాండ్ ఇచ్చేసరికి వేరే హీరోలను వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ లో స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత చరణ్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని లేటెస్ట్ టాక్. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మహేష్ తో చేయాల్సిన గ్యాంగ్ స్టర్ కథతోనే వంశీ పైడిపల్లి చరణ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా చరణ్ స్టామినా తెలిసేలా చేస్తాయని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష