మంచు లక్ష్మి ఈజ్ ఆన్ ఫైర్..!

July 18, 2018


img

మంచు లక్ష్మి లీడ్ రోల్ లో వస్తున్న వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన మీద తన కుటుంబం మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది మంచు వారి అమ్మాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కొన్ని ఎంజాయ్ చేసేలా ఉన్నాయి.. కాని కొన్ని మాత్రం తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా వస్తున్నాయి. వాటిని చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు మంచు లక్ష్మి.

మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఫోటోలు, వీడియోలు ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని.. అసలు తమ కుటుంబం గురించి ఏం తెలుసని అలా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని ఫైర్ అయ్యారు మంచు లక్ష్మి. నా ఫ్యామిలీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే తాను సింహంలా మారి వారిని చంపేయాలనిపిస్తుందని.. అలాంటి వారి పట్ల పశ్చాత్తాపం పడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు మంచు లక్ష్మి. దమ్ముంటే తన ముందు వచ్చి మాట్లాడాలని ఇలాంటి వార్తలు ఇక మీదట రాయకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మంచు లక్ష్మి.  



Related Post

సినిమా స‌మీక్ష