తమ్మిడికుంట ప్రారంభోత్సవంలో నాగార్జున ఏమన్నారంటే..

November 12, 2026


img

నగరం నడిబొడ్డున హైటెక్ సిటీ సమీపంలో గల తమ్మిడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తయినందున బుధవారం రాత్రి సిఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. 

ఆ చెరువులో కొంత భాగం ఆక్రమించి ఆయన ‘ఎన్ కన్వెన్షన్’నిర్మించారంటూ హైడ్రా కూల్చివేసిన సంగతి ఈ సందర్భంగా అయన గుర్తుచేసుకుంటూ, “తమ్మిడికుంట చెరువు గురించి నాకు బాగా తెలుసు..’ అంటూ నవ్వారు.

ఆయన ఆవిధంగా ఎందుకు అన్నారో అందరికీ తెలుసు. కనుక అందరూ నవ్వారు.

ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, “ఆ సమయంలో నేను తీవ్ర ఆందోళనతో హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌ను కలిశాను. కానీ అయన చాలా ఓపికగా నాకు అంతా వివరించిన తర్వాత, నిజమే కదా?నగరాభివ్రుద్ధి కోసం ఈ మాత్రం త్యాగం చేయలేనా? అనుకుంటూ నా రెండెకరాల భూమిని ప్రభుత్వానికి వ్రాసి ఇచ్చేశాను.

నాడు మురికి కూపంగా ఉండే తమ్మిడికుంట చెరువు నేడు ఇంత అందంగా తీర్చిదిద్దిన హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.నా తర్వాత సినిమా షూటింగ్ ఇక్కడే జరుపుకునేందుకు అనుమతించాలని సిఎం రేవంత్ రెడ్డిగారిని ఈ సందర్భంగా అభ్యర్ధిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post