భారత్-ఇరాన్ మద్య ఎప్పటి నుంచి బలమైన వాణిజ్య, స్నేహ సంబంధాలున్నాయి. కనుక భారత్ అభ్యర్ధించగానే హర్మూజ్ జలసంధి గుండా భారత్ చమురు, గ్యాస్ నౌకలకు ఇరాన్ సేఫ్ పాసేజ్ కల్పించింది.
ఇందుకు కృతజ్ఞతగా భారత్ కూడా ఇరాన్‌కు మందులు పంపింది. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్‌లో పలువురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులవుతున్నారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఇలాంటి యుద్ధ సమయంలో అత్యవసరమైన మందులు ఏర్పాటు చేసుకోవడం ఇరాన్ ప్రభుత్వానికి చాలా కష్టమే. పైగా ఎప్పుడు ఏ నౌకపై బాంబులు పడతాయో తెలీని పరిస్థితి. అయినప్పటికీ ఇరాన్ కష్టసమయంలో భారత్ మందులు పంపించింది. ఇందుకు ఇరాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
ఇరాన్‌కు మందులు పంపించడం ద్వారా భారత్ ఆ దేశం పట్ల సానుభూతితో ఉందని అమెరికాకు కూడా తెలియజేసినట్లే భావించవచ్చు. ప్రపంచదేశాలకు చమురు, గ్యాస్ సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ చేతిలో ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడానికి మిత్రదేశాలు తరలిరావాలని డోనాల్డ్ ట్రంప్ కోరితే ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు. అంటే అవి కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నమని చెప్పకనే చెప్పాయి.
వారం పది రోజుల క్రితం ఆయన ఈ యుద్ధం ముగించాలనుకుంటే, ఇరాన్ మూడు షరతులు విధించడంతో ట్రంప్ అహం దెబ్బ తింది. ఈ యుద్ధంలో గెలవడం ట్రంప్‌కి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కనుక మొండిగా యుద్ధం కొనసాగిస్తున్నారు.

Embassy of the Islamic Republic of Iran in India says, "The first shipment of medical aid from the esteemed people of India has been delivered to the Iranian Red Crescent Society. We sincerely thank the kind people of India."

(Video source: Embassy of the Islamic Republic of… pic.twitter.com/6LobbWCdmY
— ANI (@ANI) March 18, 2026