ఈటీవీలో న్యూస్ రీడర్‌గా చేయాలనుకుంటున్నారా? ఇదిగో మీ కోసం అవకాశం. ఈటీవీలో న్యూస్ రీడర్లుగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది.
మంచి కంఠ స్వరంతో తెలుగు ఉచ్చారణ స్పష్టం ఉండాలి. డిగ్రీ కలిగి ఉండాలి. న్యూస్ రీడర్లుగా చేస్తున్నవారికి తోలి ప్రాధాన్యం. ఆసక్తి, అర్హత, అనుభవం ఉన్నవారు ఈ నెల 10లోగా recruitment@etv.co.inకు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఈటీవీ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది.
జర్నలిజం రంగంలో అభిరుచి, అర్హత, అనుభవం ఉన్నవారికి ఇదొక చక్కటి అవకాశమేనని చెప్పవచ్చు. ఈటీవీ జబర్దస్త్ వంటి రియాల్టీ షోలలో నటించినవారు, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలలో పాల్గొన్నవారు, ఈటీవీలో యాంకర్లుగా పనిచేసినవారు ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి వెళ్ళి ఇంకా పాపులర్ అయ్యారు.
ఈటీవీలో న్యూస్ రీడర్‌గా చేస్తే సినీ పరిశ్రమలోకి వెళ్తారని కాదు. కానీ ఇలాంటి ప్రసిద్ద సంస్థలో పనిచేసిన అనుభవంతో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఈ అనుభవం భవిష్యత్‌లో రాణించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. కనుక ఆసక్తి, అర్హత, అనుభవం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.