తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వెంటనే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వెల్లడించింది. దాని ప్రకారం ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా భారీగానే సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. బిజేపి ఎప్పటిలాగే మూడో స్థానంలో నామ మాత్రపు సీట్లతో సరిపెట్టుకుంటుందని తేల్చి చెప్పేసింది.
మొత్తం ఏడు కార్పోరేషన్లలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తుందని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లు బిజేపి దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 68-76, బీఆర్ఎస్ పార్టీ 29-36, బిజేపి 3-5, 0-1 మజ్లీస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
సర్పే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 1210-1290 వార్డులు, బీఆర్ఎస్ పార్టీ 860-930, బిజేపి 250-270, మజ్లీస్ 35-44, సీపీఐ 12-17, సీపీగాఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది.
రామగుండం కార్పోరేషన్: కాంగ్రెస్: 30-34, బీఆర్ఎస్: 16-20, బిజేపి:3-6, ఇతరులు: 4-7 డివిజన్లు
మంచిర్యాల కార్పోరేషన్: కాంగ్రెస్: 39-43, బీఆర్ఎస్:8-12, బిజేపి: 6-9, ఇతరులు:1-2 డివిజన్లు
కొత్తగూడెం కార్పోరేషన్: కాంగ్రెస్: 28-34, బీఆర్ఎస్: 7-9, సీపీఐ: 14-16, ఇతరులు: 2-4 డివిజన్లు
మహబూబ్‌నగర్ కార్పోరేషన్: కాంగ్రెస్: 26-30, బీఆర్ఎస్:18-22, బిజేపి:6-8, మజ్లీస్: 2-4,ఇతరులు: 0-1 డివిజన్లు
నల్గొండ కార్పోరేషన్: కాంగ్రెస్: 21-26, బీఆర్ఎస్:8-12, బిజేపి: 6-10, మజ్లీస్: 2-4, ఇతరులు: 1-2 డివిజన్లు
నిజామాబాద్ కార్పోరేషన్: కాంగ్రెస్:-16, బీఆర్ఎస్: 2-4, బిజేపి:26-31, మజ్లీస్: 8-12, ఇతరులు: 1-2డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ జోస్యం చెప్పింది.