జిహెచ్‌ఎంసి: ఇప్పుడు ఒకటి కాదు.. మూడు!

February 11, 2026


img

హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర జనాభాతో చుట్టుపక్కల జిల్లాలకు విస్తరిస్తోంది. కనుక పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్‌ఎంసిని మూడు కార్పోరేషన్లుగా విభజించింది. 1. జిహెచ్‌ఎంసి, 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(సీఎంసి), 3. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పోరేషన్ (ఎంఎంసీ). 

జిహెచ్‌ఎంసి పరిధిలో 150 డివిజన్లు ఉండేవి. వాటిని పునర్వ్యవస్థీకరించి 243గా మార్చింది. ఇవి కాక జిహెచ్‌ఎంసిలో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలో మరో 57 డివిజన్లు ఉన్నాయి. అన్నీ కలిపి మొత్తం 300 డివిజన్లు. ఇప్పుడు ఈ 300 డివిజన్లను మూడు కార్పోరేషన్ల మద్య విభజించింది.               

 జిహెచ్‌ఎంసి కమీషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ని యధాతధంగా కొనసాగిస్తూ, సీఎంసికి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిలను కమీషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


Related Post