మున్సిపల్... పోలింగ్ షురూ

February 11, 2026


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కానీ ఆ సమయానికి క్యూలైన్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 

రాష్ట్రంలో ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల పాలక మండళ్ళ ఏర్పాటు కొరకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఏడు కార్పోరేషన్లలో 412 డివిజన్లకు, 116 మున్సిపాలిటీలలో 2,569 వార్డు సభ్యులను నేడు ప్రజలు ఎన్నుకుంటారు.

ఈ నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు వెంటనే ప్రకటిస్తారు. విజయం సాధించిన సభ్యులు ఈ నెల 16న పరోక్ష పద్దతిలో కార్పోరేషన్లకు మేయర్లు, డెప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్ పర్సన్స్, డెప్యూటీ చైర్ పర్సన్స్ ఎన్నుకుంటారు.

మూడు ప్రధాన పార్టీలు ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీలకు ఈ ఎన్నికలలో గెలుపు చాలా కీలకం కనుక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాయి. పలు ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూకట్టారు. 


Related Post