తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు జిహెచ్‌ఎంసిలో నుంచి మల్కాజ్‌గిరి, సైబరబాద్ ప్రాంతాలను వేరు చేసి మొత్తం మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు చేసింది. విభజన తర్వాత జిహెచ్‌ఎంసిలో మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లు ఉంటాయని తెలియజేస్తూ నేడు మరో ఉత్తర్వులు జారీ చేసింది.
జిహెచ్‌ఎంసిలో జోన్లు: సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ,రాజేంద్రనగర్, చార్మినార్, శంషాబాద్.
సికింద్రాబాద్ జోన్ సర్కిల్స్: కవాడీగూడ, ముషీరాబాద్, తార్నాక, అంబర్ పేట, మెట్టుగూడ.
ఖైరతాబాద్ జోన్ సర్కిల్స్: ఖైరతాబాద్, అమీర్ పేట, బొరబండ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్.
గోల్కొండ జోన్ సర్కిల్స్: మాసాబ్ ట్యాంక్, మొహిదీపట్నం, గోల్కొండ, ఘోషా మహల్, కార్వాన్.
రాజేంద్ర నగర్ జోన్ సర్కిల్స్: రాజేంద్ర నగర్, అత్తాపూర్, బహదూర్ పుర, ఫలక్ నుమా, చాంద్రాయణ గుట్ట, జంగం మెట్.
చార్మినార్ జోన్ సర్కిల్స్: చార్మినార్, మూసారాం బాగ్, మలక్ పేట, యాక్ట్ పురా, సంతోష్ నగర్.
శంషాబాద్ జోన్ సర్కిల్స్: శంషాబాద్: ఆదిభట్ల, బడంగ్ పేట్, జల్ పల్లి.