రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు ఇలా...

February 11, 2026


img

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి చైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ని ఆ పదవిలో నుంచి తప్పించి ఆయన స్థానంలో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ని నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సబ్యాసాచి ఘోష్‌కి ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కమీషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. 

ప్లానింగ్ విభాగం చూస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ సుల్తానియాకు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టరుగా మయాంక్ మిట్టల్‌కు బాధ్యతలు అప్పగించింది. దివ్య దేవరాజన్‌కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమీషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు మరియు ప్రజావాణి నోడల్ అధికారిణిగా పి. కాత్యాయిని దేవికి బాధ్యతలు అప్పగించింది. 

జిహెచ్‌ఎంసిలో నుంచి సైబరాబాద్ (సీఎంసి), మల్కాజ్‌గిరి (ఎంఎంసీ)లను వేరు చేసి కొత్తగా మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక జిహెచ్‌ఎంసికి ఆర్వీ కర్ణన్‌ని కొనసాగిస్తూ, సీఎంసికి శ్రీజన, ఎంఎంసీకి విని కృష్ణారెడ్డిలను కమీషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



Related Post