నేడు తొలిదశ పంచాయితీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొద్ది సేపటి క్రితమే పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియవలసి ఉండగా సాయంత్రం 5 గంటల వరకు సాగింది. కనుక వెంటనే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మొదలుపెట్టేశారు.
తొలిదశలో మొత్తం 3834 సర్పంచ్ పదవులలో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన 776 మంది విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో కూడా రెండో స్థానానికే పరిమితమయ్యింది. అది బలపరిచిన వారిలో 312 మంది మాత్రమే విజయం సాధించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బీజేపి కేవలం 63 మందితో మూడో స్థానానికి పరిమితమైంది. 164 మంది స్వతంత్ర అభ్యర్ధులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్ధులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీసి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇండ్ల రాజ్య గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.