రేపు ప్రభాకర్ రావు అరెస్ట్‌?

December 11, 2025


img

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఇంటలిజన్స్ అధినేత ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (శుక్రవారం) ఉదయంలోగా జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది!

తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తేనే అమెరికా నుంచి తిరిగివస్తానని ప్రభాకర్ రావు పట్టుపట్టగా, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదు కానీ సిట్ అధికారులు ఈ కేసులో ఆయనని అరెస్ట్‌ చేయకుండా  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఈ కేసు విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించాలనే షరతు విధించింది. అందుకు అయన అంగీకరించారు. విచారణకు హాజరవుతున్నారు. కానీ ఆయన విచారణలో తమకు  ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. ఆయన సుప్రీంకోర్టు ఆదేశాన్ని, బెయిల్‌ షరతు కూడా ఉల్లంఘిస్తున్నారు. కనుక అయనని రేపు ఉదయంలోగా పోలీసులకు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ కేసులో ఆయనే ప్రధాన పాత్రధారి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. కనుక అయన లొంగిపోతే కేసు విచారణలో పురోగతి సాధించవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు కూడా ఒకప్పుడు పోలీస్ శాఖలో పనిచేసిన అధికారే. కనుక సిట్ అధికారులు ఆయన నోరు తెరిపించగాలరో లేదో త్వరలో తెలుస్తుంది. ఒకవేళ ఆయన నోరు తెరిస్తే బీఆర్ఎస్‌ పార్టీలో మళ్ళీ ప్రకంపనలు మొదలవుతాయి. 



Related Post