ఏఐజీ హాస్పిటలో కేసీఆర్‌… ఆరోగ్య పరీక్షలకి

June 14, 2025


img

తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ శుక్రవారం హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శనివారం మద్యాహ్నం 2 గంటలకు హాస్పిటల్‌ చేరుకున్న కేసీఆర్‌ గంటసేపు అక్కడ ఉన్నారు.

కేసీఆర్‌ నేడు మళ్ళీ మరోసారి హాస్పిటల్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభం అయ్యింది. 

కానీ ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసం వచ్చారని వైద్యులు తెలిపారు. కేసీఆర్‌ వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. కనుక ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కనుక ప్రతీ 6 నెలలకు ఓ సారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదేనని వైద్యులన్నారు. 

ఇప్పుడు కేసీఆర్‌ని ఒక్క సమస్య కాదు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మొదట కూతురు కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నందుకు కుమిలిపోయిన కేసీఆర్‌, ఇప్పుడు ఆమె వల్లనే ఇబ్బంది పడుతున్నారు. తన రాజకీయ వారసుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. అది సాధ్యపడలేదు. కనీసం ఇప్పుడు పార్టీ పగ్గాలైనా అప్పజెప్పుదామంటే హరీష్ రావు బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు కొలిక్కి వస్తుండటం ఆందోళనకరమే. కనుక కేసీఆర్‌లో వృద్ధాప్య ఛాయలు చూస్తుంటే ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లనిపిస్తోంది. 


Related Post